సీనియర్ నటుడు శ్రీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన కొత్త వెబ్ సిరీస్ ‘అబ్జెక్షన్ మై లార్డ్’ (నోటరీ పరశురాం). సంతోష్ అయ్యప్పన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్‌ను డ్రీమ్ హౌస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజ్‌కుమార్ ఆకెళ్ల నిర్మించారు. 7 ఎపిసోడ్ల ఎమోషనల్ కోర్ట్ రూమ్ డ్రామాగా రూపొందిన ఈ సిరీస్ జూలై 31 నుంచి ‘జీ5’ (ZEE5) ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో సిరీస్ ప్రివ్యూ ఈవెంట్‌ను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో చిత్రయూనిట్ సభ్యులతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఓటీటీ సంస్థ జీ5తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న శ్రీకాంత్, ఇందులో మునుపెన్నడూ చూడని విభిన్నమైన పాత్రలో కనిపించనున్నట్లు చెప్పారు. అలాగే, మెగాస్టార్ చిరంజీవి ఈ సిరీస్ గురించి తెలుసుకొని ప్రత్యేకంగా అభినందించడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ఆయన వెల్లడించారు. దర్శకుడు పక్కా ప్లానింగ్‌తో కేవలం 19 రోజుల్లోనే అత్యంత నాణ్యతతో ఈ సిరీస్‌ను పూర్తి చేశారని చిత్రబృందం తెలిపింది.
ఈ సిరీస్‌లో అనన్య శర్మ, ముఖేష్ రుషి, స్నేహాల్, సమీర్, జెమినీ సురేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అరుణ్ సంగీతం అందించిన ఈ కోర్ట్ రూమ్ డ్రామా జూలై 31 నుంచి జీ5 వేదికగా డిజిటల్ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.
The submit మెగాస్టార్ అభినందనలు అందుకున్న శ్రీకాంత్ కోర్ట్ రూమ్ డ్రామా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.
