ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవైటెడ్ భారతీయ సినిమాల్లో రణబీర్ కపూర్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో దర్శకుడు నితీష్ తివారి తెరకెక్కిస్తున్న సినిమా రామాయణ కూడా ఒకటి. భారీ విజువల్ వండర్ గా వస్తున్న ఈ సినిమా ట్రైలర్ పట్ల మరింత ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో సినిమా ఆడియో హక్కుల కోసం కూడా ఇప్పుడు ఆసక్తి నెలకొంది.
అయితే ఎట్టకేలకు ఈ హక్కులు దిగ్గజ ఆడియో సంస్థ టీ సిరీస్ కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. వారు ఏకంగా 75 కోట్లకి ఈ సినిమా హక్కులు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమాకి హాలీవుడ్ లెజెండరీ సంగీత దర్శకుడు హన్స్ జిమ్మర్, అలాగే భారతీయ లెజెండరీ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ లు సంగీతం అందిస్తున్నారు. సో వీరి కలయిక కాబట్టి ఆడియోపై అంచనాలు భారీ గానే ఉంటాయి. ఇక దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
The publish “రామాయణ” ఆడియో డీల్ లాక్.. భారీ రేటుకి ఈ సంస్థ! first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.
