Wed. Jul 29th, 2026

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న ‘AA23’ చిత్రంపై సినీ వర్గాల్లోనూ, అభిమానుల్లోనూ అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి సంబంధించి వస్తున్న ప్రతి అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే నటించనుందని ఇటీవల వార్తలు వచ్చినప్పటికీ, తాజా సమాచారం ప్రకారం ఇందులో అసలు హీరోయిన్ ఉండదని తెలుస్తోంది. కథ పూర్తిగా స్క్రిప్ట్ డిమాండ్ ఆధారంగా నడుస్తుందని, కథాంశం రీత్యా ప్రత్యేకంగా హీరోయిన్ పాత్రకు ఆస్కారం లేకపోవడంతో లోకేష్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. లోకేష్ గత చిత్రాలు ‘ఖైదీ’, ‘విక్రమ్’ తరహాలోనే రా అండ్ రస్టిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా, కేవలం కథే ప్రధానంగా ఈ సినిమా సాగనుంది.

ప్రస్తుతం అల్లు అర్జున్, అట్లీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘రాకా’ చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తుండగా, ఆమెకు సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ కూడా పూర్తయింది. ఈ లైనప్‌లో ఉన్న ‘AA23’ రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు నుంచి ప్రారంభం కానుందని టాక్.

The publish అల్లు అర్జున్ – లోకేష్ కనగరాజ్ మూవీ.. ఆ పాత్ర లేదట..! first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Scores.