కోలీవుడ్ స్టార్ నటుడు దళపతి విజయ్ హీరోగా చేసిన ఆఖరి చిత్రమే జన నాయగన్. దర్శకుడు హెచ్ వినోద్, భగవంత్ కేసరి కి రీమేక్ గా తెరకెక్కించిన ఈ సాలిడ్ చిత్రం విజయ్ సీఎం అయ్యాక విడుదల అయ్యింది కానీ అనుకున్న రేంజ్ లో అయితే వరల్డ్ వైడ్ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెర్ఫామ్ చేయడం లేదు.
పైరసి, పైగా చాలా లేట్ అయ్యిన ప్రాజెక్ట్ కూడా కావడంతో పూర్తి స్థాయిలో ఆడియెన్స్ ఈ చిత్రం చూసేందుకు ఆసక్తి చూపించడం లేదు. ఈ నేపథ్యంలో ఆడియెన్స్ ని రప్పించడానికి మేకర్స్ మరో ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సినిమాలో 6 డిలీట్ చేసిన సీన్స్ ని త్వరలోనే యాడ్ చేయనున్నట్టు దర్శకుడు కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తుంది.
సో ఆ సీన్స్ ఏంటి ఎప్పుడు యాడ్ చేస్తారు అనే క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇకవేళ యాడ్ చేసిన అవి సినిమాని సేవ్ ఎంతవరకు సేవ్ చేస్తాయి అనేది కూడా ప్రశ్నార్ధకమే.. సో దీనిపై మరింత క్లారిటీ కోసం అభిమానులు వేచి చూస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించాడు. అలాగే కే వి ఎన్ ప్రొడక్షన్స్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.
The publish ‘జన నాయగన్’లో కొత్త సీన్స్.. సేవ్ చేస్తుందా? first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.
