Wed. Jul 29th, 2026

ప్రస్తుతం మన టాలీవుడ్ నుంచి రానున్న పలు ఇంట్రెస్టింగ్ క్రేజీ కాంబినేషన్ లలో విక్టరీ వెంకటేష్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో చేస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం ‘ఆదర్శ కుటుంబం’ కూడా ఒకటి. ఈ పాటికే విడుదల కావాల్సిన ఈ సినిమా నుంచి వరుస అప్డేట్స్ ఇపుడు అందిస్తున్నారు. ఇలా లేటెస్ట్ గా హీరోయిన్ శ్రీనిధి శెట్టిపై వదిలిన టీజర్ గ్లింప్స్ మంచి ఎంటర్టైన్మెంట్ ని ఆడియెన్స్ కి ప్రామిస్ చేస్తుంది.

వెంకీ మామపై మంచి ఫన్, తన భార్య కోసం చెప్పిన డైలాగ్ లు ఇంకా నటి నివేతా పెత్తురాజ్ కూడా ఇందులో కనిపించింది. ఇలా మొత్తానికి మరో సాలిడ్ ఎంటర్టైనర్ ని వీరు తీసుకొస్తున్నారని చెప్పొచ్చు. ఇదే ఫార్మాట్ లో సినిమా గనుక కొనసాగితే మాత్రం మళ్ళీ వింటేజ్ మ్యాజిక్ వెంకీ, త్రివిక్రమ్ ల నుంచి జరిగే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే హారికా హాసిని వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

The submit ‘ఆదర్శ కుటుంబం’ నుంచి అసలు ఫన్ మొదలు.. వెంకీ, త్రివిక్రమ్ ల మ్యాజిక్! first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.