Wed. Jul 29th, 2026
Allu Arjun: హేటర్స్‌కు అల్లు అర్జున్ స్ట్రాంగ్ మెసేజ్.. ఏం చెప్పాడు భయ్యా!

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులతో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో భావోద్వేగంగా మాట్లాడారు. అభిమాన సంఘాన్ని ఏర్పాటు చేసి ఇంత ప్రేమ, ఆదరణ చూపిస్తున్న ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు చెప్పలేకపోయినా, వారందరూ తన మనసులో ఉన్నారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి హాజరైనందుకు ఎంతో గర్వంగా ఉందని, అభిమానులకు “థాంక్యూ” చెబుతూ వారి ప్రేమకు కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే “Stay the Hearth On” అంటూ అభిమానులను ఉత్సాహపరిచారు.

ఈ సందర్భంగా ఫ్యాన్స్, యాంటీ ఫ్యాన్స్, హేటర్స్ గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతి మనిషికి ఒక రోజు 100 శాతం ఎనర్జీ, సమయం ఉంటుందని, దానిని ఎలా ఉపయోగించుకోవాలనేది పూర్తిగా వారి వ్యక్తిగత నిర్ణయమని చెప్పారు. “ఎవరైనా నచ్చకపోతే వారిని ద్వేషిస్తూ, ట్రోల్ చేస్తూ మీ సమయాన్ని వృథా చేసుకోవద్దు. మీకు ఉన్న సమయం, శక్తి, అవకాశాలను మీకు నచ్చిన పనికే వినియోగించండి. నచ్చని విషయాల కోసం ఒక్క శాతం కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మీ జీవితాన్ని ఆనందంగా గడపడానికి, మీ లక్ష్యాలపై దృష్టి పెట్టడానికి ఆ సమయాన్ని ఉపయోగించుకోండి” అని అల్లు అర్జున్ అభిమానులకు సూచించారు. అల్లు అర్జున్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా హేటర్స్‌కు పరోక్షంగా ఇచ్చిన సందేశం, పాజిటివ్ ఆలోచనతో ముందుకు సాగాలన్న ఆయన మాటలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.