అక్కినేని యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోకి అఖిల్ అక్కినేని హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన మంచి ఎమోషనల్ యాక్షన్ డ్రామానే “లెనిన్”. కాస్త ఆలస్యం అయినప్పటికీ కంటెంట్ బలంగా ఉండటంతో ఆడియెన్స్ ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ అందించారు.
ఇక ఈ సినిమా సాలిడ్ వీకెండ్ తర్వాత మొదటి వర్కింగ్ డే సోమవారం టెస్ట్ కి బాక్సాఫీస్ దగ్గరకి వచ్చింది. అయితే ఈ టెస్ట్ లో లెనిన్ పాస్ అయ్యాడని చెప్పవచ్చు. సోమవారం ఒక్క బుక్ మై షోలోనే ఈ సినిమా 74 వేల పై చిలుకు టికెట్స్ బుక్ అయ్యాయి. ఓ మిడ్ రేంజ్ సినిమాకి ఈ నంబర్స్ డీసెంట్ అని చెప్పవచ్చు.
ఇక ఇదే ఈ మంగళవారం నుంచి కూడా కంటిన్యూ అయితే లెనిన్ 100 కోట్ల మార్క్ దగ్గరకి వెళ్లినా ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించాడు. అలాగే నాగార్జున, నాగవంశీ నిర్మాణం వహించారు.
The submit ‘లెనిన్’ మండే టెస్ట్ ఫలితం ఏంటంటే! first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.
