యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ క్రేజీ లవ్ స్టోరీ ‘చెన్నై లవ్ స్టోరీ’ థియేట్రికల్ బిజినెస్ పరంగా టాలీవుడ్‌లో మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. సాయి రాజేష్ కథ, స్క్రీన్‌ప్లే అందించిన ఈ ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.
తాజాగా ఈ సినిమా నైజాం ఏరియా డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌కు సంబంధించిన క్రేజీ అప్‌డేట్ వెలువడింది. ఈ చిత్ర నైజాం రైట్స్‌ను టాలీవుడ్ లీడింగ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ కైవసం చేసుకుంది.
మైత్రీ సంస్థ ఈ సినిమాను నైజాంలో అడ్వాన్స్ బేసిస్ పై భారీ స్థాయిలో విడుదల చేయడానికి సిద్ధమైంది. సినిమా కంటెంట్‌పై ఉన్న నమ్మకంతోనే ఈ డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో శ్రీగౌరి ప్రియ హీరోయిన్‌గా నటిస్తుండగా మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం జూలై 24న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది.
The put up ‘చెన్నై లవ్ స్టోరీ’ నైజాం రిలీజ్.. మైత్రీ ఖాతాలో మరో హిట్ ఖాయం..? first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.
