Tue. Jul 14th, 2026
Shruti Haasan: రమ్యకృష్ణ బ్యూటీ సీక్రెట్ రివీల్ చేసిన శృతిహాసన్.. అసలు కారణం ఇదేనట!

Shruti Haasan: సీనియర్ నటి రమ్యకృష్ణ అందం, ఫిట్‌నెస్ గురించి అభిమానులు తరచూ చర్చించుకుంటూనే ఉంటారు. దశాబ్దాలు గడిచినా అదే గ్లామర్, అదే ఎనర్జీతో ప్రేక్షకులను అలరిస్తున్న ఆమె బ్యూటీ సీక్రెట్ ఏంటనే ప్రశ్నకు తాజాగా హీరోయిన్ శృతిహాసన్ చేసిన సరదా కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇటీవల వైరల్ అయిన ఓ వీడియోలో రమ్యకృష్ణ ఫ్లైట్ జర్నీ టైంలో ఎయిర్‌లైన్‌లో అందించే ఆహారం బదులుగా ఇంటి నుంచి తీసుకువచ్చిన భోజనాన్నే ఆస్వాదిస్తూ కనిపించారు. స్టార్ యాక్టర్ అయినప్పటికీ ఆమె హోమ్‌మేడ్ ఫుడ్‌కే ప్రాధాన్యం ఇవ్వడం నెటిజన్లను ఆకట్టుకుంది. ఈ వీడియోను చూసిన అభిమానులు ఆమె సింప్లిసిటీని ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

ఈ వీడియోలో హీరోయిన్ శృతిహాసన్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా రమ్యకృష్ణ ఎయిర్‌లైన్‌లో అందించే ఆహారం బదులుగా హోమ్‌మేడ్ ఫుడ్‌కే ప్రాధాన్యం ఇవ్వడంపై ఆమె స్పందిస్తూ “రమ్యకృష్ణ ఎప్పటికీ ఇంత అందంగా కనిపించడానికి ఇంట్లో వండిన ఆహారమే ఒక రహస్యమేమో” అంటూ సరదాగా కామెంట్స్ చేశారు. ఆమె చేసిన ఈ కామెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. శృతిహాసన్ వ్యాఖ్యకు నెటిజన్లు కూడా మద్దతు తెలుపుతూ, ఆరోగ్యకరమైన ఇంటి భోజనం మంచి ఆరోగ్యంతో పాటు సహజమైన అందాన్ని కూడా కాపాడుతుందని కామెంట్స్ చేస్తున్నారు.