Tue. Jul 14th, 2026
Raaka : డ్యూయల్ కాదు ట్రిపుల్ కాదు.. అంతకుమించి రాకా!

అట్లీ ఏ కథ చెప్పి బన్నీని ఒప్పించాడో కానీ.. ‘పుష్ప 2’ తర్వాత త్రివిక్రమ్‌ను పక్కన పెట్టి మరీ ‘రాకా’కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అనౌన్స్‌మెంట్ వీడియో చూస్తుంటే హాలీవుడ్ రేంజ్‌లో విజువల్ ఎఫెక్ట్స్‌తో తీస్తున్నాడు అనిపిస్తుంది. హాలీవుడ్ టెక్నీషియన్స్ మాటలు వింటుంటే, ఏదో కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్నారు అనిపిస్తుంది. కెరీర్‌లో ఇంతవరకు డ్యూయల్ రోల్ పోషించని అల్లు అర్జున్, ‘రాకా’లో ఏకంగా నాలుగు రోల్స్ పోషిస్తున్నాడని తెలిసింది. తాత, తండ్రి, ఇద్దరు కొడుకులుగా నటిస్తున్నాడని సమాచారం.

ముందుగా మూడు రోల్స్ ను బన్నీతో వేయించాలని అట్లీ అనుకుంటే, ఆ నాలుగో పాత్ర కూడా తనే చేస్తానని హీరో పట్టుబట్టారట. మేకప్ టెస్ట్ తర్వాత అట్లీ ఓకే చేసినట్టు సమాచారం. ‘రాకా’లో హీరో నాలుగు పాత్రలు చేయడంతో షూటింగ్ ఆలస్యం అవుతుంది. ఈ ఏడాది డిసెంబర్‌లో రిలీజ్ అవుతుంది అనుకుంటే.. 2027 చివర్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అనౌన్స్‌మెంట్ వీడియో చూస్తుంటే ‘రాకా’ టీం పెద్ద ప్రయోగమే చేస్తోంది. షూటింగ్ మొత్తం ముంబైలోనే జరుగుతోంది. ఈ ప్యాన్ వరల్డ్ మూవీని 1000 కోట్లకు పైగా బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది.