ఇటీవల ‘స్వయంభు’ షూటింగ్ పూర్తి చేసుకున్న యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, ఆ యోధుడి పాత్ర కోసం దాదాపు ఏడాదిన్నర కాలం కేటాయించాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం, ఈ ఏడాది సెప్టెంబర్‌లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇకపై తన సినిమాలను వేగంగా పూర్తి చేయాలని నిఖిల్ భావిస్తున్నాడు.
ప్రస్తుతం రామ్ చరణ్, అభిషేక్ అగర్వాల్ నిర్మాణంలో వస్తున్న ‘ది ఇండియా హౌస్’ షూటింగ్‌లో నిఖిల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తయిన ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఆఖరి కల్లా ముగించి, 2027 సమ్మర్‌లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు.
దీని తర్వాత చందూ మొండేటి దర్శకత్వంలో రాబోతున్న మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ ‘కార్తికేయ 3’ లైన్లోకి రానుంది. ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ అయిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది ఆరంభంలో షూటింగ్ ప్రారంభం కానుంది. ఇవి కాకుండా నిఖిల్ మరో రెండు కొత్త చిత్రాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇలా వరుస ప్రాజెక్ట్స్‌తో నిఖిల్ అదరగొడుతున్నాడు.
The publish తన లైనప్, ప్లానింగ్‌తో అదరగొడుతున్న నిఖిల్ first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Scores.
