Tue. Jul 14th, 2026

పలుమార్లు వాయిదా పడిన రాకింగ్ స్టార్ యష్ లేటెస్ట్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ‘టాక్సిక్’ ఎట్టకేలకు ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తాజాగా ఒక క్రేజీ మైల్‌స్టోన్‌ను అందుకుంది.

ప్రముఖ ప్లాట్‌ఫామ్ IMDb ప్రకారం, ప్రస్తుతం ఇండియాలోనే అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల జాబితాలో ‘టాక్సిక్’ టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఇటీవల విడుదలైన ‘లేడీస్ & లేడీస్’ టీజర్, ‘తబాహి’ సాంగ్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి.

కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

The put up ‘టాక్సిక్’ క్రేజ్.. ఇండియాలోనే టాప్ ప్లేస్‌లో యష్ మూవీ..! first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.