‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రంతో ఆస్కార్ సాధించి చరిత్ర సృష్టించిన దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి, ఇప్పుడు తన నెక్స్ట్ భారీ ప్రాజెక్ట్ ‘వారణాసి’తో మరోసారి ఆస్కార్ అవార్డులే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాడు. తెలుగు సినిమాకు మరిన్ని అంతర్జాతీయ అవార్డులు తీసుకురావాలనే పట్టుదలతో జక్కన్న బృందం ఇప్పటి నుంచే పక్కా ప్రణాళికలతో పని చేస్తోంది.
ఆర్‌ఆర్‌ఆర్ సమయంలో ఆస్కార్ ప్రమోషన్స్ మరియు గ్లోబల్ మార్కెటింగ్ బాధ్యతలను దగ్గరుండి చూసుకున్న రాజమౌళి తనయుడు ఎస్ఎస్.కార్తికేయ.. ఆ అనుభవాన్ని ఇప్పుడు ‘వారణాసి’ చిత్రానికి ఉపయోగించబోతున్నాడట. ఈ సినిమాను ఏయే కేటగిరీల్లో పోటీకి నిలపాలి, అక్కడ మార్కెటింగ్ ఎలా చేయాలనే దానిపై రాజమౌళి బృందానికి ఇప్పటికే ఒక స్పష్టత వచ్చింది.
తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ‘డోన్ట్ ట్రబుల్ ది ట్రబుల్’ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత కార్తికేయ ఆస్కార్ మార్కెటింగ్‌పై స్పందించాడు. ఇండియాలో అద్భుతమైన సినిమాలు తయారవుతున్నాయని, సరైన మార్కెటింగ్ స్ట్రాటజీ ఉంటే ఆస్కార్ సాధించడం అసాధ్యమేమీ కాదని ఆయన తేల్చిచెప్పాడు. ఈ పక్కా ప్లానింగ్‌తో ‘వారణాసి’ చిత్రం మరోసారి అంతర్జాతీయ వేదికపై తెలుగు సినిమా జెండా పాతడం ఖాయంగా కనిపిస్తోంది.
The put up ‘వారణాసి’తో జక్కన్న టార్గెట్ అదేనా..? first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.
