Johnny Grasp: టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్లు జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య విభేదాలు తలెత్తాయంటూ నిన్న (ఆదివారం) సోషల్ మీడియాలో పలు వీడియోలు, స్టోరీలు వైరల్ అయ్యాయి. అయితే ఈ ప్రచారాలకు తాజాగా జానీ మాస్టర్ స్వయంగా స్పందిస్తూ పూర్తి స్థాయిలో క్లారిటీ ఇచ్చారు. తనకు శేఖర్ మాస్టర్‌కి మధ్య ఎలాంటి అపార్థాలు, విభేదాలు లేవని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జానీ మాస్టర్ తన ఎక్స్ అకౌంట్లో ఒక పోస్ట్ చేశారు. శేఖర్ మాస్టర్ తనకు అన్నలాంటి వారని, తామిద్దరం ఒకే కుటుంబంలా ఎప్పటినుంచో కలిసి ఉంటున్నామని చెప్పారు. ఒకరికి ఒకరం ఎప్పుడూ అండగా నిలిచామని, తమ మధ్య గొడవలు ఉన్నాయంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న వీడియోలు, కథనాలను నమ్మవద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ఈ రూమర్స్ వైరల్ అయిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి స్వయంగా సినిమా షూటింగ్ సెట్స్‌లో తనతో (జానీ మాస్టర్), శేఖర్ మాస్టర్ ఇద్దరితో మాట్లాడినట్లు వెల్లడించారు. అనంతరం ముగ్గురూ కలిసి కొంతసేపు సరదాగా గడిపి, కలిసి భోజనం కూడా చేసినట్లు వెల్లడించారు. చిరంజీవి గారు చూపించిన ప్రేమ, మార్గదర్శకత్వం, మద్దతు తమకు ఎంతో విలువైనవని జానీ మాస్టర్ పేర్కొన్నారు. చివరగా అభిమానులు, సినీ ప్రేమికులు ఎలాంటి ఆధారాలు లేని ప్రచారాలను నమ్మవద్దని, వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని ఆయన కోరారు. ప్రేమ, పరస్పర గౌరవం, సానుకూల దృక్పథంతో అందరూ కలిసి ముందుకు సాగాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
A couple of deceptive movies and false reviews were doing the rounds over the past couple of days….
I need to make this transparent… there may be completely no false impression or war between me and Shekar Grasp Anna. We’re one circle of relatives and we’ve at all times stood via every different.… pic.twitter.com/oCOsngCtwI
— Jani Grasp (@AlwaysJani) July 13, 2026
