నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఆయన ఇప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక మాస్ యాక్షన్ డ్రామా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో రాబోయే తన నెక్స్ట్ చిత్రంపై బాలయ్య దృష్టి పెట్టనున్నాడు. ఇదిలా ఉంటే, టాలీవుడ్ మీడియాలో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం, బాలకృష్ణ మరోసారి హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో జతకట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ఎమోషనల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భగవంత్ కేసరి’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. బాలయ్యను సరికొత్తగా ప్రెజెంట్ చేసిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా క్రేజ్ ఎంతలా ఉందంటే.. కోలీవుడ్ స్టార్ విజయ్ నటిస్తున్న చివరి మైల్‌స్టోన్ చిత్రం ‘జననాయగన్’కు ఇదే మూలకథ కావడం విశేషం.
బాలకృష్ణ – అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రాబోయే ఈ రెండో ప్రాజెక్ట్‌ను 2028 సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
The put up మరోసారి చేతులు కలపనున్న క్రేజీ కాంబినేషన్.. బాలయ్యతో సెట్ చేస్తున్న హిట్ మెషిన్..? first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.
