Tue. Jul 14th, 2026

రాకింగ్ స్టార్ మంచు మనోజ్‌ హీరోగా తెరకెక్కుతున్న పీరియాడికల్‌ యాక్షన్‌ మూవీ ‘డేవిడ్‌ రెడ్డి’. హనుమరెడ్డి యక్కంటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ప్యాచ్ వర్క్ షూట్ పూర్తి అయింది. నిజానికి గతంలోనే ఈ సీక్వెన్స్ షూటింగ్ పూర్తి అయినా.. అవుట్ ఫుట్ విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకూడదనే ఉద్దేశ్యంతో ఈ సీక్వెన్స్ ను భారీ స్థాయిలో మళ్ళీ రీషూట్ చేశారు. ఈ సీక్వెన్స్ విషయంలో మనోజ్ కూడా స్పెషల్ కేర్ తీసుకున్నారట.

ఇక ‘డేవిడ్‌ రెడ్డి’ కథ విషయానికొస్తే.. స్వాతంత్రానికి పూర్వం జరిగిన కథ ఇది. బ్రిటిష్‌ వారిపై పోరాడిన ‘డేవిడ్‌ రెడ్డి’ అనే యోధుడి కథగా రానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం ‘వార్‌ డాగ్‌’ అనే బైక్‌ను రూపొందించారు. దాని బరువు దాదాపు 700 కేజీలు. సినిమాలో అది ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అన్నట్టు ఈ సినిమాలో మనోజ్‌ సరసన ‘ప్రిన్స్‌’ (కోలీవుడ్‌ మూవీ) హీరోయిన్‌ మరియా నటించబోతుంది.

The put up రీషూట్ పూర్తి చేసిన ‘డేవిడ్‌ రెడ్డి’ ! first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.