ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాస్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో ‘రాకా’ చిత్రం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రేజీ ప్రాజెక్ట్ తర్వాత బన్నీ.. లోకేష్ కనగరాజ్‌తో జతకట్టబోతున్నాడు. సాధారణంగా లోకేష్ కనగరాజ్ అనగానే మైండ్ బ్లోయింగ్ యాక్షన్ థ్రిల్లర్స్, డార్క్ షేడ్స్, హీరో ఎలివేషన్లు గుర్తుకు వస్తాయి. బన్నీతో కూడా అలాంటి సినిమానే ఉంటుందని అందరూ ఆశిస్తున్నారు. అయితే, ఈసారి లోకేష్ సరికొత్త సర్‌ప్రైజ్‌తో రాబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్.
ఈ చిత్రంలో కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, మైథాలజీ టచ్ కూడా ఇవ్వబోతున్నాడట. కథలో పురాణాలతో లింక్ ఉండే ఒక పవర్‌ఫుల్ ఎపిసోడ్ ఉందని, అందులో బన్నీ లుక్ మరియు క్యారెక్టరైజేషన్ వేరే లెవెల్‌లో ఉంటాయని ఇన్ సైడ్ టాక్. పురాణాల్లో అత్యంత శక్తిమంతమైన ఒక పాత్ర స్ఫూర్తితో లేదా ఆ తరహా గెటప్‌లో బన్నీ కనిపిస్తాడని సమాచారం. అయితే ఆ పాత్ర ఏంటనేది ప్రస్తుతానికి పూర్తి సస్పెన్స్.
నిజానికి పురాణాల నేపథ్యం ఉన్న కథ చేయాలని బన్నీ చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు. గతంలో ఎన్టీఆర్ – త్రివిక్రమ్ ల ‘గాడ్ ఆఫ్ వార్’ కూడా బన్నీ వరకు వచ్చి, ఆ తర్వాత మళ్లీ ఎన్టీఆర్ వద్దకే వెళ్ళింది. అలా మిస్సయిన మైథాలజీ కోరికను బన్నీ.. లోకేష్ సినిమాతో తీర్చుకోబోతున్నాడు. మరి లోకేష్ కనగరాజ్ ఈ యాక్షన్-మైథాలజీ బ్లెండ్‌ను స్క్రీన్ మీద ఎలా ఆవిష్కరిస్తాడో చూడాలి.
The put up బన్నీ కోసం లోకేష్ ఆ అంశాలు తీసుకొస్తాడా..? first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.
