అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటించిన లేటెస్ట్ మూవీ ‘లెనిన్’ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. రిలీజైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ చిత్రం, ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకుంటూ హిట్‌గా నిలిచింది. ఈ క్రమంలోనే సినిమాకు ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు, అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ చిత్ర యూనిట్ గ్రాండ్ సెలబ్రేషన్స్‌కు సిద్ధమైంది.
ఈ బ్లాక్‌బస్టర్ సక్సెస్ ఈవెంట్‌ను గుంటూరు వేదికగా అత్యంత వైభవంగా నిర్వహించబోతున్నారు. జూలై 15న గుంటూరులోని జేకేసీ కాలేజ్ రోడ్‌లో ఉన్న భాష్యం ఒలింపస్ గ్రౌండ్స్‌లో ఈ వేడుకలు జరగనున్నాయి. ఆ రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఈ ఈవెంట్ ప్రారంభం కాబోతున్నట్లు నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ అధికారికంగా ప్రకటించింది. “ఈ విజయం మీ అందరిది” అంటూ సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని పంచుకున్నారు.
అభిమానుల మధ్య గ్రాండ్ సెలబ్రేషన్స్
భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమాలో అఖిల్ నటనకు, డైరెక్టర్ మేకింగ్‌కు ఆడియన్స్ ఫిదా అయ్యారు. థమన్ అందించిన మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లాయి. ఈ సక్సెస్ మీట్‌లో హీరో అఖిల్‌తో పాటు హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే, కింగ్ నాగార్జున, నిర్మాత వంశీ, దర్శకుడు కిషోర్ అబ్బురుతో పాటు మిగిలిన చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొనబోతున్నారు. గుంటూరులో జరగబోయే ఈ ఈవెంట్‌తో థియేటర్ల వద్ద ఉన్న జోష్, సెలబ్రేషన్స్ మరింత రెట్టింపు కావడం ఖాయంగా కనిపిస్తోంది.
The put up Akhil Akkineni: గుంటూరు వేదికగా ‘లెనిన్’ సక్సెస్ సెలబ్రేషన్స్! ఈవెంట్ డేట్, వెన్యూ డీటెయిల్స్ ఇవే! first seemed on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.
