Tue. Jul 14th, 2026

ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో, దర్శకుడు మేర్లపాక గాంధీ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్‌లో ఒక డిఫరెంట్ క్రాస్-కల్చరల్ హారర్ కామెడీ చిత్రం ‘కొరియన్ కనకరాజు’ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 7న రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో ఈ మూవీ నుంచి తాజాగా టీజర్‌ను రిలీజ్ చేశఆరు మేకర్స్. పూర్తి కామెడీ, హారర్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమాను ఎంటర్‌టైనింగ్‌గా రూపొందించారని ఈ టీజర్ కట్ చూస్తే అర్థమవుతోంది.

ఈ చిత్ర టీజర్‌ను రెబల్ స్టార్ ప్రభాస్ విడుదల చేశాడు. వరుణ్ తేజ్ తన రాయలసీమ గ్రామాన్ని పరిచయం చేసే క్రియేటివ్ సీన్‌తో ఈ టీజర్ ప్రారంభమవుతుంది, అయితే బ్యాక్‌గ్రౌండ్‌లో మాత్రం కొరియా విజువల్స్ కనిపించడం విశేషం. ఇందులో కనకరాజు పాత్రలో వరుణ్ తేజ్, ఆయన స్నేహితుడిగా సత్య పక్కా రాయలసీమ మాస్ లుక్ మరియు కామెడీ టైమింగ్‌తో అదరగొట్టారు. దీనికి పూర్తి భిన్నంగా, వరుణ్ తేజ్ కొరియన్ గ్యాంగ్‌స్టర్ లుక్‌లో సరికొత్త స్వాగ్‌తో కనిపించి ఎంతగానో ఆకట్టుకున్నాడు.

సినిమాలో వరుణ్ తేజ్ పాత్రకు దెయ్యం పట్టిన తర్వాత వచ్చే కామెడీ సీన్స్, ఆయన డిఫరెంట్ లుక్స్ ఈ సినిమా ఒక కంప్లీట్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందని స్పష్టం చేస్తున్నాయి. రెండు విభిన్నమైన పాత్రల్లో వరుణ్ తేజ్ చూపించిన వేరియేషన్స్ మరియు చార్మ్ ఆకట్టుకుంటున్నాయి. దీనికి తోడు థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హారర్, కామెడీ ఎలిమెంట్స్‌ను పర్ఫెక్ట్‌గా ఎలివేట్ చేసింది. మొత్తానికి ఈ ప్రామిసింగ్ టీజర్‌తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సినిమాలో రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తోంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

The submit టీజర్ టాక్ : రాయలసీమ మాస్.. కొరియన్ క్లాస్.. ‘కొరియన్ కనకరాజు’ నవ్వుల జాతర..! first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.