Tue. Jul 14th, 2026

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా తన కెరీర్ 158వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడు కొల్లి బాబీ వాల్తేరు వీరయ్య తర్వాత అంతకు మించిన స్కేల్ తో ప్లాన్ చేస్తున్న ఈ సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. ఇలా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా నుంచి ఈ ఆగష్టు 22న రానున్న ఫస్ట్ గ్లింప్స్ పై మరింత హైప్ ని ఎక్కిస్తున్నాడు. ఈసారి మెగాస్టార్ కి కొట్టే స్కోర్ మీరు ఎంతైనా ఊహించుకోండి అంతకు మించే ఉంటుంది అని తాను బ్లాక్ బస్టర్ ప్రామిస్ ని అందించాడు. దీనితో ఈ క్రేజీ ప్రాజెక్ట్ విషయంలో థమన్ వర్క్ పై మరిన్ని అంచనాలు పెరిగాయి. ఇక ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ అనశ్వర రంజన్ మెగాస్టార్ కి కూతురుగా నటిస్తుండగా కన్నడ నిర్మాణ సంస్థ కే వి ఎన్ ప్రొడక్షన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

The publish ఎంతైనా ఊహించుకోండి.. ‘మెగా 158’ పై థమన్ ప్రామిస్! first seemed on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.