రీసెంట్ గా మన టాలీవుడ్ నుంచి వచ్చిన చిత్రాల్లో టాలెంటెడ్ కాంబినేషన్ దర్శకుడు వెంకటేష్ మహా అలాగే హీరో సత్యదేవ్ ల నుంచి వచ్చిన చిత్రం ‘రావు బహదూర్’ కూడా ఒకటి. కేరాఫ్ కంచరపాలెం తర్వాత మహా నుంచి డైరెక్ట్ సినిమా కావడం, పైగా సత్యదేవ్ తో ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య సినిమా తర్వాత చేస్తున్న సినిమా కావడంతో దీనిపై మంచి అంచనాలు నెలకొన్నాయి.
ఇలా విడుదలకి వచ్చిన రావు బహదూర్ మాత్రం ఒకింత మిక్స్డ్ టాక్ సొంతం చేసుకోగా సినీ ప్రముఖుల నుంచి మాత్రం ఈ సినిమాకి ప్రశంసలు ఆగలేదు. తాజాగా సెన్సేషనల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ రావు బహదూర్ చూసాక తన ఎగ్జైట్మెంట్ ని చెప్పకుండా ఉండలేకపోయాడు.
“ఈ సినిమా ఒక అరుదైన సినిమా అని మనం అసలు సినిమాను ఎందుకు ప్రేమిస్తామో అనేది గుర్తుచేసే గొప్ప చిత్రాల్లో ఇది కూడా ముందు స్థానంలో నిలుస్తుంది. నిజమైన సినిమా ప్రేమికుడు ప్రతీ ఒక్కరికీ నాదొక విన్నపం… ఈ సినిమా కోసం మీ జీవితంలోని మూడు గంటల సమయాన్ని కేటాయించండి. ఇది మీ శ్రద్ధకు, మీ సహనానికి, మీ అప్లాజ్ కి ఈ చిత్రం అర్హత కలిగినదే.
దర్శకుడు వెంకటేష్ మహా ఆర్థిక పరిమితులతోనే అందమైన సినిమా రూపొందించారు అని, దీనికి ధైర్యం మరియు పూర్తి నమ్మకం కావాలి. సత్యదేవ్ అద్భుతంగా నటించారు. అనవసర ఆర్భాటాలు లేవు. షార్ట్‌కట్‌లు లేవు. కేవలం స్వచ్ఛమైన సినిమా”. అంటూ సందీప్ రెడ్డి వంగ ఈ చిత్రాన్ని ఆకాశానికి ఎత్తేసారు. దీనితో వెంకటేష్ మహా కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలిపాడు.
Thanks very a lot on your time, your heartfelt phrases and your love for Rao Bahadur, Sandeep https://t.co/iEjatVA2zC
— Venkatesh Maha (@mahaisnotanoun) July 13, 2026
The put up ‘రావు బహదూర్’ పై ‘స్పిరిట్’ దర్శకుడు రివ్యూ.. ఇదొక అరుదైన సినిమా first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.
